'సెయాన్' లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే-డివైన్ ఫస్ట్ లుక్ రిలీజ్

- May 06, 2026 , by Maagulf
\'సెయాన్\' లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే-డివైన్ ఫస్ట్ లుక్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న  'సెయాన్' కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది.
 
గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్..  ట్రెడిషన్‌, డివైన్ వైబ్ మేళవింపుగా ఆకట్టుకుంటోంది. గాజుల షాప్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె కనిపించిన తీరు పాత్రలోని ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ ఆమె కూర్చున్న తీరు మరింత ఆసక్తిని పెంచింది.  

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శివకార్తికేయన్, ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకగా నిలిచింది. తన ప్రత్యేకమైన మ్యూజికల్ స్టైల్‌తో, చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్‌తో పేరుగాంచిన సంతోష్ నారాయణన్ సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.  

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ, టర్మరిక్ మీడియా విజన్  కలిసిన “సెయాన్” 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలవనుంది.

తారాగణం: శివకార్తికేయన్, భాగ్యశ్రీ బోర్సే

దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
నిర్మాత: కమల్ హాసన్ - ఆర్. మహేంద్రన్
బ్యానర్స్: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్,  టర్మరిక్ మీడియా
సంగీతం: సంతోష్ నారాయణన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com