భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!

- May 07, 2026 , by Maagulf
భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!

మనామా: క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. రిఫా ప్యాలెస్‌లో మిడిలీస్టు, ఉత్తర ఆఫ్రికాకు యునైటెడ్ కింగ్‌డమ్ సీనియర్ రక్షణ సలహాదారు అయిన వైస్ అడ్మిరల్ ఎడ్వర్డ్ అహ్ల్‌గ్రెన్ మరియు ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో వ్యూహాత్మక సహకారం మరియు బహ్రెయిన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ఉన్న సుదీర్ఘకాల సంబంధాన్ని హిస్ రాయల్ హైనెస్ ప్రముఖంగా ప్రస్తావించారు.
ఉమ్మడి లక్ష్యాలు మరియు ఆకాంక్షలను సాధించడానికి, ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలు మరియు ఒప్పందాలకు, ముఖ్యంగా సమగ్ర భద్రతా ఒప్పందం (CSIPA)కు అనుగుణంగా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ స్పష్టం చేశారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతను పరిరక్షించడంలో యునైటెడ్ కింగ్‌డమ్ మరియు దాని మిత్రదేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.  

ఇరాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో బహ్రెయిన్-యూకే సంబంధాల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సైనిక మరియు రక్షణ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలు, అలాగే తాజా ప్రాంతీయ పరిణామాలు తదితర ఉమ్మడి ఆసక్తి గల అంశాలపై సమీక్షించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com