సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్‌లో ఉద్రిక్తత

- May 07, 2026 , by Maagulf
సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్‌లో ఉద్రిక్తత

కోల్ కత్తా: సువెందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(PA), బీజేపీ నాయకుడు చంద్రనాథ్ రథ్ను దుండగులు కాల్చిచంపిన ఘటన కోల్ కత్తా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం రాత్రి మద్యంగ్రామంలో చోటుచేసుకుంది. రథ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించిన దుండగులు కాల్పులు జరిపారు.కారు ముందు సీటులో ఉన్న రథ్‌ను అత్యంత సమీపం నుంచి లక్ష్యంగా చేసుకుని కాల్చినట్లు తెలుస్తోంది. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం.తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు.వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడి చికిత్స పొందుతున్నారు.  ఈ దాడి వెనుక టిఎంసి అనుచరుల హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సువెందు అధికారి తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సువెందు తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న రోజుల నుంచే చంద్రనాథ్ రథ్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం, బీజేపీ అధికారంలోకి రావడం తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ-తృణమూల్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, తాజా హత్య రాష్ట్ర రాజకీయ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com