సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- May 07, 2026
మస్కట్: వివిధ రంగాలలో సాంకేతిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు జరిపాయి. ఒమన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఒమన్ కంట్రీ మేనేజర్ వెండీ వెర్నర్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందంతో సమావేశమైంది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని 'ఒమన్ విజన్ 2040 అమలు పర్యవేక్షణ విభాగం' అధిపతి సయ్యద్ డాక్టర్ ముంథిర్ బిన్ హిలాల్ అల్ బుసైదీ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఇరువర్గాల మధ్య సహకారానికి గల అవకాశాలతోపాటు ఆర్థిక వైవిధ్యీకరణ మరియు ఒమన్ లో లేబర్ మార్కెట్ సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు.
పదవ పంచవర్ష ప్రణాళికలో సాధించిన ఆర్థిక పనితీరు సూచికలను మరియు 'ఒమన్ విజన్ 2040' సంబంధిత కార్యక్రమాల అమలులో సాధించిన పురోగతిని కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. సమావేశం ముగింపులో ఇరుపక్షాలు తమ మధ్య సాంకేతిక సమన్వయాన్ని కొనసాగించడం ప్రాముఖ్యతను తెలియజేశారు. తదుపరి సమావేశాలలో కార్యాచరణ అంశాలతోపాటు ఉమ్మడి సహకారం కోసం విధివిధానాలను రూపొందించాలని ఇరువర్గాలు అంగీకరించాయి.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







