'పవర్‌పేట' పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

- May 07, 2026 , by Maagulf
\'పవర్‌పేట\' పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్  70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతుంది. బలమైన కథనంతో కూడిన సినిమాలకు మద్దతు ఇవ్వడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పుట్టినరోజు సందర్భంగా, పవర్‌పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమవుతుంది. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య హీరో ఎంట్రీ,  సిగరెట్ తాగుతూ సింహం గురించి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడం అలరించింది ఆ తర్వాత ఆ నేల స్వభావం, దానికి శక్తినిచ్చే మనుషుల గురించి చెబుతూ తన పాత్ర ఇంటెన్స్ చూపించారు. థియేటర్ స్క్రీన్‌పై బాణాసంచా విసిరే సీన్‌తో గ్లింప్స్ మరింత మాస్ ఫీల్‌ను అందించింది.

సందీప్ కిషన్ ఈ సినిమాలో రగ్గ్డ్ పీరియాడిక్ అవతార్‌లో కనిపించారు. స్టైలిష్ షేడ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, రా అటిట్యూడ్‌తో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. ‘సేనాపతి రవి’ అనే పాత్ర పేరును రివీల్ చేయడం ద్వారా ఆ క్యారెక్టర్‌లోని డామినేషన్, ఇంటెన్సిటీని సూచించారు. సందీప్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దర్శకుడు కృష్ణ చైతన్య భారీ స్థాయి మాస్ క్యారెక్టరైజేషన్‌ను ఎంత బలంగా డిజైన్ చేశారో ఈ గ్లింప్స్‌లో స్పష్టమవుతోంది. పాత్ర ఎలివేషన్స్, డైలాగ్స్ ఆయన రచయితగా ఉన్న బలాన్ని మరోసారి చాటాయి. సిగరెట్ వెలిగించే చిన్న సీన్‌ను కూడా కోపం, ఆవేశంతో నింపి చూపించిన తీరు దర్శకుడి స్టైల్‌ను ప్రతిబింబిస్తోంది.

మధీ సినిమాటోగ్రఫీ పీరియాడిక్ సెటప్‌ను అద్భుతంగా చూపించగా, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్‌కు మరింత పవర్ ఇచ్చింది. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైన్, సచిన్ సుధాకరన్, హరిహరన్ సౌండ్ డిజైన్ చిత్రానికి ప్రత్యేకమైన టెక్స్చర్‌ను తీసుకొస్తున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.

తారాగణం: సందీప్ కిషన్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మణిశర్మ
డీవోపీ: మదీ
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక
సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com