90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- May 08, 2026
మస్కట్: ఒమన్ గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ గత ఐదేళ్లలో సాధించిన గణంకాలను తెలియజేసింది. ఒమన్ సుల్తానేట్ వేగవంతమైన పట్టణ మరియు అభివృద్ధి సంబంధిత పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపింది.
2020 నుండి 2025 మధ్య కాలంలో 8,000 కంటే ఎక్కువ కుటుంబాలు సొంత ఇళ్లను పొందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో సామాజిక గృహనిర్మాణ కార్యక్రమాల కింద 200 మిలియన్ రియాల్స్ (RO) ఖర్చు చేసినట్లు పేర్కొంది. గత సంవత్సరంలోనే 2,794 కుటుంబాలు ఈ నిధుల ద్వారా లబ్ధి పొందాయన్నారు.
అలాగే, గృహనిర్మాణ సహాయం పొందిన కేసుల సంఖ్య 2020లో 1,260 నుండి 2025 నాటికి 1,782కి పెరిగిందన్నారు. 2021 నుండి 2025 మధ్య కాలంలో 90వేల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు స్థలాలను లేదా నివాసాల యూనిట్లను పొందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 2025 సంవత్సరంలోనే 15,434 కుటుంబాలు వివిధ గృహనిర్మాణ ఎంపికల ద్వారా లబ్ధి పొందాయన్నారు.
2020తో పోలిస్తే 2024 మరియు 2025 సంవత్సరాల మధ్య స్థిరాస్తి రంగంలో వాణిజ్య విలువ RO 3.3 బిలియన్లకు పెరిగి, 37.5 శాతం సంచిత వృద్ధిని సాధించిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్థిరాస్తి వాణిజ్యంలో వార్షిక వృద్ధి రేటు 6.6 శాతానికి చేరుకోగా, 2024 మరియు 2025 మధ్య ఒమన్ సుల్తానేట్‌లో గల్ఫ్ స్థిరాస్తి పెట్టుబడి 95.3 శాతం వృద్ధిని నమోదు చేసింది మరియు విదేశీ పెట్టుబడి 39.4 శాతం పెరిగిందని వివరించారు.
ఒమన్ సుల్తానేట్ జీవన నాణ్యతను పెంచడానికి జాతీయ కార్యక్రమాల్లో ఒకటైన "లైవ్ ఒమన్" లక్ష్యం గురించి కూడా ప్రస్తావించారు. భద్రత, స్థిరత్వం, సేవల నాణ్యత ఆధారంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు సమగ్ర జీవన వాతావరణాన్ని అందించడం ద్వారా ఇది సాధించబడుతుందని పేర్కొంది. ఈ విధానం కారణంగా 2025 సంవత్సరానికి గాను జీవన నాణ్యత సూచికలో ప్రపంచవ్యాప్తంగా ఒమన్ నాల్గవ స్థానాన్ని సాధించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో గృహ మరియు పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ సయీద్ అల్ షుయైలీ, గృహ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజనీర్ హమద్ అలీ అల్ నజ్వానీ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ అలీ అల్ ముతావా తో పాటు పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







