విజయ్ సంచలన నిర్ణయం..
- May 08, 2026
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా..? కాంగ్రెస్‌తోపాటు ఎవరెవరి మద్దతు విజయ్ పార్టీకి ఉంది.. గవర్నర్ నిర్ణయంపై విజయ్ ఎలా ముందుకెళ్లబోతున్నారనే చర్చ తమిళ రాజకీయ వర్గల్లో జోరుగా సాగుతోంది.. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే ఏకం కాబోతున్నాయని.. ఆ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆ రెండు పార్టీలకు బిగ్ షాకిచ్చేలా.. సంచలన నిర్ణయం తీసుకునేందుకు విజయ్ రెడీ అయ్యారని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ నుంచి 108 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ప్రస్తుతం టీవీకే వద్ద 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది (విజయ్ రెండు చోట్ల పోటీచేసి గెలవడంతో ఒక ఎమ్మెల్యేగానే పరిగణలోకి వస్తుంది). కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో ఆ పార్టీకి చెందిన ఐదుగురుతో కలిపితే టీవీకే బలం 112కు చేరింది. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. అన్నాడీఎంకేలోకి 20మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
టీవీకేకు పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవటంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. విజయ్ రెండు సార్లు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, పూర్తిస్థాయి మెజార్టీ చూపిన తరువాతనే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇస్తానంటూ గవర్నర్ తేల్చి చెప్పడంతో విజయ్ న్యాయస్థానాల ద్వారా తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. టీవీకేకు చెందిన 107మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేయాలని విజయ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తద్వారా ప్రజల్లోకి మళ్లీ వెళ్లేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలాఉంటే.. డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు విషయంపై కేవలం ఊహాగానాలు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను అన్నాడీఎంకే నేతలు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు.. డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆర్నెళ్ల వరకు వారిని ఇబ్బంది పెట్టమని చెప్పుకొచ్చాడు. దీంతో అన్నాడీఎంకేతో పొత్తు లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







