సినిమా రివ్యూ: ‘సతీ లీలావతి’
- May 08, 2026
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి, బాబు పుట్టిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి చిత్రమే ‘సతీ లీలావతి’.‘భీమిలి కబడ్తీ జట్టు’, ‘ఎస్ఎమ్ఎస్’ సినిమాలను తెరకెక్కించిన తాతినేని సత్య ఈ సినిమాకి దర్శకులు. దేవ్ మోహన్ హీరోగా నటించాడు. మడోనా సెబాస్టియన్ ఇంపార్టెంట్ రోల్ పోషించింది.ఈ సినిమాకి ప్రమోషన్లు అంతంత మాత్రంగానే నిర్వహించినప్పటికీ ప్రచార చిత్రాలు ఓ వర్గం ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేశాయ్. అందునా మెగా కోడలయ్యాకా లావణ్య త్రిపాఠి నటించిన తొలి చిత్రం కావడంతో ఆటోమెటిగ్గా అంచనాలు క్రియేట్ అయ్యాయ్ ‘సతీ లీలావతి’.పై. మరి ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకుందా.? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
స్టార్ డైరెక్టర్ అయిన లీలావతి (లావణ్య త్రిపాఠి) భర్త రామ్ సేతు (దేవ్ మోహన్). స్టార్ డైరెక్టర్ కావడంతో బిజీ షెడ్యూల్స్ వల్ల భర్తతో గడిపేందుకు టైమ్ కేటాయించలేకపోతుంటుంది. దాంతో, సేతు, లీలావతిని విడాకులు అడుగుతాడు. అంతే కాదు, నికోలా (మడోనా సెబాస్టియన్) అనే మరో అమ్మాయిని సేతు ఇష్టపడతాడు. కానీ, తన భర్తను వదులుకోవడం ఇష్టం లేని లీలావతి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. తన భర్తని ఇంట్లోనే కట్టేసి తమ పెళ్లి, వారి మధ్య గతంలో గడిపిన మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో భర్తపై కొన్ని సార్లు చేయి చేసుకుంటుంది కూడా. ఇదంతా బయట ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడేందుకు లీలావతి చేసే ప్రయత్నాలు ఫన్నీగా అనిపిస్తాయ్. మిస్ అయిన కొడుకు గురించి సేతు తండ్రి, అలాగే లావణ్య తల్లి తండ్రులు, సేతు స్నేహితులు, ఆఖరికి నికోలా కూడా లీలావతి ఇంటికి వస్తుంటారు. వారిని మేనేజ్ చేయడానికి లీలావతి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు తాను ఒప్పుకున్న సినిమా చేయలేదని నిర్మాత లీలావతిని కిడ్నాప్ చేస్తాడు. ఈ టైమ్‌లోనే లీలావతి ఇంట్లో ఓ దొంగ (సప్తగిరి) చొరబడతాడు. మరి, ఇంట్లో కట్టి పడేసి వున్న భర్తని దొంగ విడిపించేస్తాడా.? ఈ విషయం బయటికి తెలిసిందా.? నిర్మాత బారి నుంచి లీలావతిని ఎవరు కాపాడారు.? చివరికి భార్య, భర్తలు కలిసిపోయారా.? ఇవన్నీ తెలియాలంటే ‘సతీ లీలావతి’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
లీలావతి పాత్రలో లావణ్య త్రిపాటి చాలా అందంగా ఆకర్ణణీయంగా కనిపించింది.దేవ్ మోహన్ లావణ్యకు భర్తగా, అలాగే భార్యతో సుఖ జీవితం గడపలేక మరో అమ్మాయితో ప్రేమలో పడడం, భార్య టార్చర్‌ని అనుభవించే భర్తగా ఇలా పలు కోణాల్లో తన వంతుగా నటించి మెప్పించారు. మడోనా సెబాస్టియన్ పాత్రకు వున్నంతలో బాగానే ఇంపార్టెన్స్ వుంటుంది. లావణ్యతో పాటూ, వీటీవీ గణేషన్, నరేష్, పవిత్ర లోకేష్, మొట్ట రాజేందర్, సప్తగిరి.. ఇలా చాలా మంది హాస్య నటీనటులు తమ తమ వంతుగా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. దాంతో, వారిద్దరి మధ్య జరిగే సంఘర్షణ, భావోద్వేగాలు.. వీటిని ఓ ఫన్ టోన్‌లో చెప్పాలనుకోవడమే దర్శకుడి ముఖ్యోద్దేశం. అయితే, ఆ ఉద్దేశంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడా.? అంటే అది ఆడియన్స్ నిర్ణయానికే వదిలేయాలి. ఇకపోతే, ఈ సినిమాలో తన మెయిన్ పాయింట్ ఫన్ టోన్‌ని వర్కవుట్ చేయడం కోసం చాలా మంది కమెడియన్లను వాడుకున్నాడు దర్శకుడు. కానీ, డైలాగులు ఈ సినిమాకి ఓ మైనస్ అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే, మరీ ఇంతలానా.! అనిపించేంతలా డైలాగులు విసుగు పుట్టిస్తాయ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు పెద్దగా ఆకట్టుకోవ్. ఒక్క పెళ్లి పాట మాత్రం విజువల్‌గా బాగుంటుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలకు ప్రెజెంట్‌లో కనెక్ట్ చేయడం కొన్ని చోట్ల మర్చిపోయాడా.? డైరెక్టర్ ీఅనిపిస్తుంది. డబ్బింగ్‌లోనూ పాలిష్ చేయాల్సిన అవసరం వుంది. ఎడిటింగ్‌కి చాలా ఎక్కువే పని పెట్టాల్సివుంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమాకి తగ్గట్లున్నాయ్. ఒకే లోకేషన్‌లో దాదాపుగా సినిమాని పూర్తి చేసేశారు.
ప్లస్ పాయింట్స్:
కామెడీ.. కాన్సెప్ట్.. విజువల్స్..
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని స్క్రీన్‌ప్లే, ఆకట్టుకోని భావోద్వేగాలు, కనెక్ట్ కాని ఎమోషన్స్.. బోర్ కొట్టించే హాస్య సన్నివేశాలు కొన్ని..
చివరిగా:
‘సతీ లీలావతి’.. టైటిల్ కీ సినిమా కాన్సెప్ట్‌కీ ఏం సంబంధం లేదు కానీ, ఏదో హాట్ సమ్మర్లో కూల్‌గా అలా టైమ్ పాస్ చేయాలనుకునేవాళ్లు ఓ సారి లుక్కేసేయొచ్చంతే.!
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









