మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!

- May 08, 2026 , by Maagulf
మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!

రియాద్: 2026 హజ్ యాత్ర నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ 23వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది. ఏప్రిల్ 19  నుండి మక్కా, మదీనా, మీకాత్‌లు, రెండు పవిత్ర మసీదులకు వెళ్లే రహదారులు మరియు ఇతర పవిత్ర తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల రక్షణను పెంపొందించడం, మార్కెట్లను నియంత్రించడం మరియు ఆహార సామాగ్రి లభ్యతను నిర్ధారించడం ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రాంతంలోని వాణిజ్య సంస్థలు, అలాగే అల్-జుహ్ఫా మీకాత్, యలమ్లమ్ మీకాత్, అల్-సైల్ అల్-కబీర్‌లోని కర్న్ అల్-మనాజిల్ మీకాత్ మరియు వాడి ముహర్రం మీకాత్‌లలోని చిల్లర విక్రయ కేంద్రాలలో తనిఖీలు చేసినట్లు వివరించారు. యాత్రికులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన సేవలు అందేలా చూసేందుకు, నిత్యావసర వస్తువుల లభ్యతను పరిశీలించినట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. వస్తువుల ధరలు, ఆఫర్ల ప్రామాణికతను కూడా చేక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com