మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- May 08, 2026
రియాద్: 2026 హజ్ యాత్ర నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ 23వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది. ఏప్రిల్ 19 నుండి మక్కా, మదీనా, మీకాత్లు, రెండు పవిత్ర మసీదులకు వెళ్లే రహదారులు మరియు ఇతర పవిత్ర తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల రక్షణను పెంపొందించడం, మార్కెట్లను నియంత్రించడం మరియు ఆహార సామాగ్రి లభ్యతను నిర్ధారించడం ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రాంతంలోని వాణిజ్య సంస్థలు, అలాగే అల్-జుహ్ఫా మీకాత్, యలమ్లమ్ మీకాత్, అల్-సైల్ అల్-కబీర్లోని కర్న్ అల్-మనాజిల్ మీకాత్ మరియు వాడి ముహర్రం మీకాత్లలోని చిల్లర విక్రయ కేంద్రాలలో తనిఖీలు చేసినట్లు వివరించారు. యాత్రికులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన సేవలు అందేలా చూసేందుకు, నిత్యావసర వస్తువుల లభ్యతను పరిశీలించినట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. వస్తువుల ధరలు, ఆఫర్ల ప్రామాణికతను కూడా చేక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







