అల్ దైద ఎడారిలో బంగ్లాదేశీ వ్యక్తి మృతదేహం

- August 07, 2016 , by Maagulf
అల్ దైద ఎడారిలో బంగ్లాదేశీ వ్యక్తి మృతదేహం

షార్జ:  షార్జ ఎమిరేట్ లో ఒక మారుమూల ప్రాంతంలోని  ఆల్ దైద  ఎడారి లో ఒక మృతదేహం  కనుగొనబడింది. మృతుడు  ఒక బంగ్లాదేశీ వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అలాగే  ఆ వ్యక్తి  మరణానికి దారితీసిన పరిస్థితులపై గుర్తించేందుకు ఒక విచారణ ప్రారంభించారు. హతుడిని ఇంకా పూర్తిగా  గుర్తింపు గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. శనివారం వేకువజామున ఆల్ దైద  ఎడారి లో ఒక మృతదేహం ఉన్నట్లు  పోలీసులకు సమాచారం వచ్చింది. అల్ దైద  అల్ బాటెహ్ అనబడే  ఒక మారుమూల ప్రాంతంలో ఈ శవాన్నికనుగొనబడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే  పోలీసు గస్తీ దళం , పారామెడిక్స్ మరియు నేర పరిశోధక విభాగం (సిఐడి) నుండి ఒక జట్టు  ఆ ప్రాంతానికి తరలించారు మరియు చనిపోయిన వ్యక్తి  మరణంకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరించారు.అల్ దైద  పోలీస్ నుంచి షార్జాలో అల్ దైద  హాస్పిటల్ కు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com