పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- May 08, 2026
హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా రంజన్ హత్య కేసు పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కిరాతక హత్య వెనుక పక్కా ప్లాన్‌తో వ్యవహరించిన నేపాలీ గ్యాంగ్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. నిందితులు ఆమెను అత్యంత అమానుషంగా హింసించారని, చేతులు వెనుకకు కట్టేసి, ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఆయన వివరించారు. నగదు మరియు నగలను దోచుకోవడమే లక్ష్యంగా ఈ ముఠా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ దారుణం వెనుక సుమారు ఏడాది క్రితం ఆ ఇంట్లో పనికి చేరిన నేపాలీ మహిళా పనిమనిషి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. బయట నుంచి వచ్చిన తన ముఠా సభ్యులకు ఆమె సహకరించి, ఇంటి గుట్టునంతా వారికి వివరించి ఈ హత్యకు దారి తీసిందని సీపీ తెలిపారు. ఇది ఒక పద్ధతి ప్రకారం ధనిక వర్గాల ఇళ్లే లక్ష్యంగా దోపిడీలు చేసే ముఠా పని అని, పని మనుషులుగా చేరి నమ్మకం కలిగించి ఆపై ఇలాంటి నేరాలకు ఒడిగడుతున్నారని ఆయన హెచ్చరించారు. నిందితుల కోసం ప్రస్తుతం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
పోలీసుల హెచ్చరిక
నేపాల్ నుంచి వచ్చే పని మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని గత రెండు నెలలుగా పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, ప్రజలు ఇంకా వారిని పనిలో కొనసాగించడంపై సీపీ సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు వద్దని చెబుతున్నా నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఇళ్లలో పని మనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలను సేకరించాలని, ఆధార్ వంటి గుర్తింపు కార్డులు తీసుకోవాలని మరియు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









