భారీ మొత్తానికి సింగం-3ని సొంతమ్ చేసుకున్న సురక్ష్ మీడియా
- August 07, 2016
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గినట్లుగానే ఈ చిత్రం తెలుగు హక్కులకు భారీ పోటీ నెలకొంది. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ప్యాన్సీ రేటుతో దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ తొలినుంచి మా సంస్థలో వైవిధ్యమైన చిత్రాలను అందించాలను భావనతోనే ఇటీవల సూర్య వర్సెస్ సూర్య, శౌర్య చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు తాజాగా సూర్య ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3ను తెలుగు హక్కులను దక్కించుకోవడం ఆనందంగా వుంది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం షూటింగ్లో అధికభాగం జరగడం విశేషంగా చెప్పుకోవాలి. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో అఖండ విజయం సాధిస్తుందని నమ్మకం వుంది.
ప్రముఖ కథానాయికలు అనుష్క శెట్టి, శృతిహాసన్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాతక్మంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్,
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







