మరోసారి జతకట్టనున్న చైతు, తమన్నా
- August 07, 2016
నాగచైతన్య-తమన్నాలది విజయవంతమైన జోడీ. '100%లవ్', 'తడాఖా' చిత్రాలతో వీళ్లిద్దరూ ఆకట్టుకొన్నారు. చైతూ, సమంత జోడీకి ఎంత పేరుందో, ఆ స్థాయిలోనే పేరు తెచ్చుకొన్న చైతూ-తమన్నా జోడీ మరోసారి వెండితెరపై కనిపించి మురిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే సమంత కాదనడంతోనే ఆ స్థానంలో తమన్నా ఎంపికైందని ప్రచారం సాగుతోంది. నాగచైతన్య కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అదొక ప్రేమకథ. అందులో నాగచైతన్య, సమంత జోడీ నటిస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు సమంత స్థానంలో తమన్నా ఖరారైనట్టు తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రం ఈ నెలలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







