IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం

- May 09, 2026 , by Maagulf
IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం

ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. మరోసారి జీటీ గర్జించింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది గుజరాత్. తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలర్లు సైతం సత్తా చాటారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. 230 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 77 పరుగుల తేడాతో గుజరాత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగాడు. జేసన్ హోల్డర్ 3 వికెట్లతో మెరిశాడు. రబాడ 2 వికెట్లు తీశాడు. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 5వ స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి జంప్ చేసింది గుజరాత్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com