ఒమన్‌లో డిజిటల్ ఎకానమీ సర్వేను ప్రారంభించనున్న NCSI..!!

- May 10, 2026 , by Maagulf
ఒమన్‌లో డిజిటల్ ఎకానమీ సర్వేను ప్రారంభించనున్న NCSI..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అందిస్తున్న వాటాను అంచనా వేయడానికి, జాతీయ గణాంకాలు మరియు సమాచార కేంద్రం (NCSI) డిజిటల్ ఎకానమీ సర్వే 2025ను  ప్రారంభిస్తుంది. ఈ సర్వే 2026 ఆగస్టు మధ్య వరకు కొనసాగుతుంది.

ఈ సర్వే, సుల్తానేట్ వ్యాప్తంగా వివిధ ఆర్థిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నమూనాతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) కార్యకలాపాలలో పనిచేస్తున్న సంస్థలు, ఇ-కామర్స్ సేవలను అందించే కంపెనీలు, మరియు డిజిటల్ మధ్యవర్తిత్వ వేదికలను లక్ష్యంగా నిర్వహించనుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని అంచనా వేయడానికి మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థకు దాని వాటాను పర్యవేక్షించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలలో ఈ సర్వే ఒక భాగమని NCSIలోని జాతీయ ఖాతాల విభాగం డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ ఖమీస్ బిన్ మహమ్మద్ అల్ సునైది తెలిపారు.

ఒమన్‌లో ఆర్థిక విధానాలను రూపొందించడంలో మరియు డిజిటల్  కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి కచ్చితమైన సూచికల అభివృద్ధికి ఈ సర్వే తోడ్పడుతుందని ఆయన వివరించారు.  ప్రస్తుత ధరల ప్రకారం 2025 నాటికి జీడీపీకి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అందించే వాటాను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలు వీలు కల్పిస్తాయని అల్ సునైది తెలిపారు. ప్రత్యేక సర్వే లింక్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా డేటా సేకరణ జరుగుతుందని NCSI తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com