దుబాయ్ లో కొత్తగా 500 మీటర్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- May 10, 2026
యూఏఈః వరల్డ్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద 500 మీటర్ల కొత్త బ్రిడ్జిని దుబాయ్ ఆర్టీఏ ప్రారంభించింది. ఇది అల్ బదా నుండి 2వ డిసెంబర్ స్ట్రీట్ వైపు వెళ్లే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే అక్కడి నుండి షేక్ రషీద్ రోడ్ మరియు అల్ ముస్తఖ్బల్ స్ట్రీట్ కు సులువుగా వెళ్లవచ్చు.
దుబాయ్‌ను ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాలలో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించారు. దుబాయ్ లో అత్యంత రద్దీగా మరియు కీలకమైన రవాణా మార్గాలలో ఒకటైన షేక్ జాయెద్ రోడ్‌కు సమీపంలో ఉండటం వలన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని ఆర్టీఏ ప్రకటించింది.
ఈ సింగిల్-లేన్ బ్రిడ్జిపై గంటకు 1,200 వాహనాల వరకు ప్రయాణించవచ్చు. అల్ బదా నుండి షేక్ రషీద్ స్ట్రీట్ మరియు అల్ ముస్తఖ్బల్ స్ట్రీట్ వైపు ప్రయాణించే వాహనదారులకు ప్రయాణ సమయాన్ని ఎనిమిది నిమిషాల నుండి కేవలం రెండు నిమిషాలకు తగ్గిస్తుంది.
మరోవైపు, షేక్ రషీద్ స్ట్రీట్ మరియు అల్ ముస్తఖ్బల్ స్ట్రీట్ వైపు వెళ్లే 2వ డిసెంబర్ స్ట్రీట్‌లోని సిగ్నల్ జంక్షన్‌ను కూడా ఫ్రీ-ఫ్లో కూడలిగా మార్చనున్నారు. ఇది వాహనాల రాకపోకలను మరింత క్రమబద్ధీకరించి, చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
డబ్ల్యూటీసీ రౌండ్అబౌట్ అభివృద్ధి ప్రాజెక్ట్
వరల్డ్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా పలు దిశలలో నిరంతరాయ ట్రాఫిక్ ను సులభతరం చేయడానికి రూపొందించిన మొత్తం 5,000 మీటర్ల పొడవున ఆరు బ్రిడ్జిల నిర్మాణం ఉంటుంది. ఫిబ్రవరి 2026లో, షేక్ జాయెద్ రోడ్డును షేక్ ఖలీఫా బిన్ జాయెద్ వీధితో కలిపే ఒక బ్రిడ్జిని ఆర్టీఏ ప్రారంభించింది. అంతకు ముందు, 2025 డిసెంబర్ లో 2వ డిసెంబర్ స్ట్రీట్ నుండి షేక్ రషీద్ రోడ్డు మరియు అల్ మజ్లిస్ వీధి వైపుగా అక్కడి నుండి అల్ ముస్తాఖల్ స్ట్రీట్ వరకు సాగే వాహనాల రాకపోకలకు వీలుగా మరో రెండు అదనపు బ్రడ్జిలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







