'మెంటార్ ది హీరో' కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేశ్

- August 07, 2016 , by Maagulf

చిన్నారులకు మంచి భవిష్యత్ అందించడమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని టీడీపీ నేత లోకేష్‌ పేర్కొన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'మెంటార్ ది హీరో' కార్యక్రమాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు లేకుంటే ఎంతో బాధగా ఉంటుందని, అలాంటి ఎంతో మంది చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం చేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని నారా లోకేష్‌ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com