17000 మరుగుదొడ్లు కట్టనున్న ఢిల్లీ ప్రభుత్వం
- August 07, 2016
దేశ రాజధాని దిల్లీలో ఉచితంగా మరుగుదొడ్లను నిర్మించి నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఆప్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చిలోపు దిల్లీలోని పలు ప్రాంతాల్లో 17వేల మరుగుదొడ్లను నిర్మించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణం కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. దిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ (డీయూఎస్ఐబీ) నగరంలోని 211 ప్రాంతాలను గుర్తించింది.
జేజే సమూహాల్లో మరుగుదొడ్ల కొరత ఉందని ఆ ప్రాంతంలో నివసించే వారి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అవసాన దశకు చేరిన మూత్రశాలలను గుర్తించి వాటిని దశల వారీగా పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. మురికివాడల్లో బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







