ఆగష్టు 12 నుండి పరిగెట్టనున్న తడోబా ఎక్స్‌ప్రెస్‌

- August 07, 2016 , by Maagulf
ఆగష్టు 12 నుండి పరిగెట్టనున్న తడోబా ఎక్స్‌ప్రెస్‌

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముంబయిలోని లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ (ఎల్‌టీటీ) నుంచి తెలంగాణలోని కాజీపేట వరకు తడోబా ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ నడపనుంది. ఆగస్టు 12 శుక్రవారం ఉదయం 11:30కు ఎల్‌టీటీ నుంచి ప్రారంభమైన తడోబా ఎక్స్‌ప్రెస్‌ (11083) 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాజీపేటకు చేరుతుంది. ఆగస్టు 13 శనివారం సాయంత్రం 5:45 కు ఎక్స్‌ప్రెస్‌ (11084) కాజీపేట నుంచి తిరుగు ప్రయాణమై ఆదివారం రాత్రి 11:15కు ఎల్‌టీటీకి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రారంభ రైలు(01183)ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు సికింద్రాబాద్‌లో సోమవారం ఉదయం 8గం.కు జెండా వూపి ప్రారంభిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 12:25కు ఈ రైలు కాజీపేటకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు కోసం బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రెగ్యులర్‌ సర్వీసు రిజర్వేషన్‌లను ప్రయాణీకులు రిజర్వేషన్‌ కేంద్రాలు, ఇంటర్నెట్‌ ద్వారా ఆగస్టు 8నుంచి పొందవచ్చని ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com