17000 మరుగుదొడ్లు కట్టనున్న ఢిల్లీ ప్రభుత్వం

- August 07, 2016 , by Maagulf
17000 మరుగుదొడ్లు కట్టనున్న ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని దిల్లీలో ఉచితంగా మరుగుదొడ్లను నిర్మించి నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఆప్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చిలోపు దిల్లీలోని పలు ప్రాంతాల్లో 17వేల మరుగుదొడ్లను నిర్మించాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణం కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. దిల్లీ అర్బన్‌ షెల్టర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డ్‌ (డీయూఎస్‌ఐబీ) నగరంలోని 211 ప్రాంతాలను గుర్తించింది.
జేజే సమూహాల్లో మరుగుదొడ్ల కొరత ఉందని ఆ ప్రాంతంలో నివసించే వారి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అవసాన దశకు చేరిన మూత్రశాలలను గుర్తించి వాటిని దశల వారీగా పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. మురికివాడల్లో బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com