సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- May 10, 2026
తూర్పు ప్రాంతంలో పసుపు సందడి..భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు
జుబైల్ / సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ “మినీ మహానాడు–2026” ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఈ మహాసభ పసుపు వర్ణంతో కళకళలాడింది.
కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, సంపత్ కోయ, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బులుసు, ప్రభాకర్ రెడ్డి, దిలీప్, కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందూరి, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజలక్ష్మి నందమూరి, శారద కోనేరు, వరిని బులుసు, అనిత నాగశేఖర్, సత్య మల్లిన తదితర నాయకులు, కార్యకర్తల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
‘మా తెలుగు తల్లికి’తో మహానాడు ప్రారంభం
తెలుగు యువత ఆధ్వర్యంలో “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు విభాగం కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడుకు శుభారంభం పలికారు.
రాజకీయ సమావేశాలకు నాగశేఖర్, సత్య మల్లిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
యువతకు వేదిక
పార్టీ సీనియర్ నాయకులు తమ రాజకీయ అనుభవాలను పంచుకుంటూ టీడీపీ పట్ల ఉన్న అభిమానం వ్యక్తం చేశారు. యువతకు కూడా వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం ఈ మహానాడుకు ప్రత్యేకతగా నిలిచింది.
చిన్నారుల నృత్యాలు, ప్రసంగాలు సభను ఆకట్టుకున్నాయి. “జై తెలుగుదేశం” నినాదాలతో ర్యాలీగా సభకు చేరుకున్న చిన్నారులు అందరినీ అలరించారు.
జూమ్ ద్వారా నాయకుల సందేశాలు
టీడీపీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరియు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి జూమ్ ద్వారా సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు:
- తెలుగు దేశం పార్టీ చరిత్ర
- పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి
- సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన అవసరం
వంటి అంశాలను వివరించారు.
నందమూరి కుటుంబం సందేశం
సీనియర్ నాయకులు టీడీ జనార్ధన్, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తనయుడు నందమూరి రామకృష్ణ మహానాడు ప్రాధాన్యతను వివరించారు. సౌదీలోని టీడీపీ కార్యకర్తలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
P4 కార్యక్రమం పై ప్రత్యేక చర్చ
సీనియర్ నాయకుడు వరప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మానసపుత్రిక “P4” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తిరుపతిస్వామి స్వర్ణ ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న “హిందవ స్వర్గధామం” ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు ప్రకాశం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న ప్రశంసా పత్రాలను గుర్తు చేశారు.
వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రశంసలు
తిరుపతిస్వామి స్వర్ణ మాట్లాడుతూ, సౌదీ అరేబియా నుంచి తొలిసారిగా P4 ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమన్నారు. జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ నుంచి 100 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారని తెలిపారు.
ప్రతి శుక్రవారం ప్రవాసాంధ్ర భీమా నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రవాసాంధ్రులకు సర్టిఫికెట్లు పొందడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, ఈ వ్యవస్థను తీసుకొచ్చిన నారా లోకేష్‌ను కొనియాడారు.
“ఎక్కడ తెలుగు హృదయం ఉంటే అక్కడ టీడీపీ ఉంటుంది”
కోనేరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, టీడీపీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్, అమెరికా–ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నా అక్కడ టీడీపీ పట్ల అభిమానం ఉంటుందని తెలిపారు.
రియాద్ NRI టీడీపీ ప్రతినిధుల పాల్గొనడం
NRI TDP Riyadh నుంచి తిరుపతిస్వామి స్వర్ణ, ఖాదర్ షేక్, రవి మేడూరి, హరీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వర్ణ మాట్లాడుతూ, ప్రపంచంలో తొలిసారిగా నిర్వహించిన ఈ మినీ మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడం శుభసూచికమన్నారు. ప్రతి ఒక్కరికీ వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం సభ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.
భవిష్యత్ నాయకత్వానికి పునాది
APNRTS సేవలు, P4 కార్యక్రమం, జీవ భీమా వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కోనేరు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. చిన్నారులకు వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా తూర్పు ప్రాంతం ముందడుగు వేస్తోందన్నారు.
“భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీకి నాయకత్వం వహించే నాయకులు ఇక్కడి నుంచే వెలువడతారనే నమ్మకం ఉంది” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





తాజా వార్తలు
- ఈస్ట్ బెంగళూరులో సమగ్ర మహిళలు-శిశు ఆసుపత్రిని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్-30 మే 31 వరకు పొడిగింపు
- సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- డెహ్రాడూన్‌లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రధాని మోదీ..
- ప్రధాని మోదీ ఆత్మీయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ









