ఆగష్టు 12 నుండి పరిగెట్టనున్న తడోబా ఎక్స్‌ప్రెస్
- August 07, 2016
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) నుంచి తెలంగాణలోని కాజీపేట వరకు తడోబా ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ నడపనుంది. ఆగస్టు 12 శుక్రవారం ఉదయం 11:30కు ఎల్టీటీ నుంచి ప్రారంభమైన తడోబా ఎక్స్‌ప్రెస్ (11083) 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాజీపేటకు చేరుతుంది. ఆగస్టు 13 శనివారం సాయంత్రం 5:45 కు ఎక్స్‌ప్రెస్ (11084) కాజీపేట నుంచి తిరుగు ప్రయాణమై ఆదివారం రాత్రి 11:15కు ఎల్టీటీకి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రారంభ రైలు(01183)ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు సికింద్రాబాద్‌లో సోమవారం ఉదయం 8గం.కు జెండా వూపి ప్రారంభిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 12:25కు ఈ రైలు కాజీపేటకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వీక్లీ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీసు రిజర్వేషన్లను ప్రయాణీకులు రిజర్వేషన్ కేంద్రాలు, ఇంటర్నెట్ ద్వారా ఆగస్టు 8నుంచి పొందవచ్చని ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







