ఇక 'ఫింగోపే' తో పెమెంట్లు సులభం
- August 07, 2016
షాపింగ్‌కు వెళ్లేటప్పుడు పర్సులో డబ్బు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాల్సి వస్తోంది. ఏమరపాటును మర్చిపోతే.. బిల్లు చెల్లింపు వద్ద ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. ఈ సమస్యను అధిగమించే సాధనం రాబోతోంది. చేతి వేలులోని రక్తనాళాన్ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే 'ఫింగోపే' అనే పరిజ్ఞానాన్ని బ్రిటన్‌కు చెందిన స్టాలర్ అనే సంస్థ రూపొందించింది. .
ఈ పరిజ్ఞానంలో ఒక బయోమెట్రిక్ రీడర్ ఉంటుంది. ఇది వినియోగదారుడి వేళ్లలోని సిరలను స్కాన్ చేస్తుంది. తద్వారా ప్రతి వినియోగదారుడికి సంబంధించిన ఒక విశిష్ట మ్యాప్‌ను నిర్మిస్తుంది. దీన్ని క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తుంది. ఫలితంగా బుల్లి స్కానర్‌పై వేలును ఉంచడం ద్వారా దుకాణంలో సొమ్మును చెల్లించవచ్చు. ఇద్దరు వ్యక్తులకు ఒకే తరహా సిర నిర్మాణం ఉండే అవకాశం 340 కోట్లలో ఒక వంతు మాత్రమే ఉందని పరిశోధకులు తెలిపారు. అంటే ఈ పరిజ్ఞానం దుర్బేధ్యమైనదని చెప్పారు. దీన్ని లండన్‌లోని ఒక నైట్ క్లబ్లో పరీక్షించనున్నట్లు సదరు కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







