ధోఫార్‌లో స్ప్రింగ్స్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక చర్యలు..!!
- May 11, 2026
సలాలా: ధోఫార్ గవర్నరేట్‌లోని లోయలు మరియు పర్వత శ్రేణులలో లోతుగా ఉన్న కిలే, డాన్ మరియు అజ్‌ఘోట్ స్ప్రింగ్స్ నిర్వహణ మరియు పునరుద్ధరణ పనులను పూర్తి చేసినట్లు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. సహజ నీటి వనరులను పరిరక్షించడం, అవి సమాజాలకు ఉపయోగపడేలా చూడటం అనే ప్రయత్నంలో ఈ కృషి ఒక భాగమన్నారు.
సలాలా విలాయత్‌లోని అడౌనిబ్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న మంచినీటి వనరు అయిన కిలే బుగ్గ, కాలినడకన సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సలాలాలోని ఐన్ కోర్ జలపాతం ప్రదేశానికి ఉత్తరాన ఉన్న డాన్ స్ప్రింగ్ కు వెళ్లేందుకు లోయలు మరియు పర్వత వాలుల గుండా నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రఖ్యూత్ విలాయత్‌లోని అజ్‌ఘోట్ స్ప్రింగ్ , అత్యంత కఠినమైన పర్వత మార్గాల వెంబడి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనివల్ల పునరుద్ధరణ మరియు నిర్వహణ పనులు చాలా కష్టంగా మారాయని జలవనరుల శాఖ డైరెక్టర్ ఇంజనీర్ అలీ బిన్ బఖీత్ బీట్ సయీద్ పేర్కొన్నారు. సలాలాలోని ఐన్ కోర్ జలపాతం ప్రదేశానికి ఉత్తరాన ఉన్న డాన్ స్ప్రింగ్ పునరుద్ధరణను కూడా డైరెక్టరేట్ పూర్తి చేసిందని ఆయన తెలిపారు. సహజ నీటి వనరుల సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా 2025 నుండి ధోఫార్‌లోని పలు విలాయత్‌లలో 17 స్ప్రింగ్ లను మంత్రిత్వ శాఖ పునరుద్ధరించిందని జలవనరుల శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







