హైదరాబాద్‌లో జూలై 15–16 తేదీల్లో DM–CX–Loyalty Summit 2026

- May 11, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో జూలై 15–16 తేదీల్లో DM–CX–Loyalty Summit 2026

AI, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై జాతీయ స్థాయి చర్చలు

హైదరాబాద్: కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కృత్రిమ మేధస్సు (AI), బ్రాండింగ్ మరియు లాయల్టీ ఆధారిత వ్యాపార వృద్ధిపై చర్చలకు హైదరాబాద్ వేదిక కానుంది. జూలై 15, 16 తేదీల్లో టీ-హబ్‌లో జరగనున్న “DM–CX–Loyalty Summit 2026” దేశవ్యాప్తంగా పరిశ్రమలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, పాలసీ నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురానుంది.

“From Data to Devotion” అనే ప్రధాన థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో AI, డేటా అనలిటిక్స్, పర్సనలైజేషన్ ద్వారా కస్టమర్ నమ్మకం, దీర్ఘకాలిక అనుబంధం, వ్యాపార వృద్ధిని ఎలా సాధించాలనే అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.

ప్రముఖ సంస్థల భాగస్వామ్యం

ఈ సదస్సుకు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI), ది పాలసీ టైమ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పుణే ఏంజెల్స్ నెట్‌వర్క్ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నారు. పరిశ్రమలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు మరియు పాలసీ మేకర్ల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యాలు ఏర్పాటయ్యాయి.

అతిథి గౌరవంగా ఏపీ మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఈ సదస్సుకు అతిథి గౌరవంగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బలోపేతంలో ఆయన పోషిస్తున్న పాత్ర పై నిర్వాహకులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ, జాతీయ స్థాయి స్పీకర్ల సందడి

ఈ సదస్సులో పాలన, మీడియా, మార్కెటింగ్, బ్రాండింగ్, విద్య, స్టార్టప్‌లు, డిజిటల్ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించనున్నారు.

ప్రధాన స్పీకర్లు:

జరీనా బాబర్ – అసిస్టెంట్ కమిషనర్ & చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్, మిన్నెసోటా
ప్రొఫెసర్ ఉజ్వల్ కె. చౌధురి – ప్రో వైస్ చాన్సలర్, టెక్నో ఇండియా యూనివర్సిటీ
ఇరామ్ జైదీ – స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్
సమ్రాట్ ముఖర్జీ – మాడిసన్ వరల్డ్ వైస్ ప్రెసిడెంట్
బాలీవుడ్ నిర్మాత, నటుడు వివేక్ వాస్వానీ
మేజర్ సునీల్ శెట్టి (రిటైర్డ్) – My Startup TV వ్యవస్థాపకుడు
డా. సంజయ్ అరోరా – మార్కెటింగ్ & బ్రాండింగ్ నిపుణుడు
ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ (వాహ్ చెఫ్)
ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్. రవికుమార్

ఇంకా ప్రపంచస్థాయి బ్రాండ్లు, ప్రభుత్వ సంస్థలు, అకాడమిక్ రంగం, మీడియా, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు చెందిన మరిన్ని ప్రముఖులను త్వరలో ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

స్టార్టప్ షోకేస్ ప్రత్యేక ఆకర్షణ

సదస్సులో భాగంగా నిర్వహించే “స్టార్టప్ షోకేస్” ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మేజర్ సునీల్ శెట్టి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి దశలో ఉన్న స్టార్టప్‌లకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు, పాలసీ మేకర్లతో నేరుగా కలిసే అవకాశం కల్పించనున్నారు.

స్టార్టప్‌లకు విజిబిలిటీ, మెంటార్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పెట్టుబడుల అవకాశాలు పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

FTCCI అధ్యక్షుడు ఆర్. రవికుమార్ మాట్లాడుతూ, “1917 నుంచి పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు సేవలందిస్తున్న FTCCI, DM–CX–Loyalty Summit 2026తో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. తెలంగాణ రైజింగ్ 2047, వికసిత భారత్ @2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ సదస్సు తెలంగాణను డిజిటల్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా మరింత ముందుకు తీసుకెళ్తుంది” అని అన్నారు.

ఆర్గనైజింగ్ టీం మెంబెర్స్ 

ఈ సదస్సుకు వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు, బ్రాండింగ్ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు సమాచారం.

మరిన్ని వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.

http://https://events.themadbuzz.com/dm-loyalty-summit-india/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com