అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య సేవలు ప్రారంభం..!!
- May 11, 2026
దోహా: ఖతార్ వ్యాప్తంగా ప్రత్యేక క్లినిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య సేవలను (Ophthalmology Services) ప్రారంభిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) ప్రకటించింది.
అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య క్లినిక్ ఏర్పాటుతో నేత్ర వైద్య సేవలను అందించే ఆరోగ్య కేంద్రాల సంఖ్య 19కి చేరింది. ఖతార్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ కేంద్రాల ద్వారా ప్రత్యేక ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, అత్యవసర నేత్ర సంరక్షణ సేవలను మరింత సులభంగా పొందేందుకు వీలు కలుగుతుంది.
ప్రస్తుతం లీబైబ్, అల్ సద్ద్, అల్ తుమామా, అల్ మషాఫ్, ఘర్రాఫత్ అల్ రయాన్, అల్ ఖోర్, ముయిథర్, అల్ రువైస్, ఉమ్ అల్ సెనీమ్, అల్ రయాన్, వెస్ట్ బే, ఉమ్ స్లాల్, అల్ వాజ్బా, మెసైమీర్, ఖతార్ యూనివర్సిటీ, అల్ వక్రా, ఎయిర్‌పోర్ట్, అల్ ఖైలాబ్ ఆరోగ్య కేంద్రాల్లో నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







