రొయ్యలు, పెరుగు కూర

- August 07, 2016 , by Maagulf
రొయ్యలు, పెరుగు కూర

 కావలసిన పదార్దాలు :పచ్చిరొయ్యలు : అరకేజిపెరుగు : అర కప్పుమషాలా పొడి : అర టీ స్పూన్పచ్చిమిర్చి : మూడుఉల్లి ముక్కలు : అర కప్పుటమాటా : ఒకటిఉప్పు : తగినంతకారం :టీ స్పూన్పసుపు : కొద్దిగానూనె : అర కప్పు గసగసాలు : టీ స్పూన్కరివేపాకు : కొద్దిగాఅల్లం వెల్లుల్లి పేస్టూ  : టీ స్పూన్కొత్తిమీర : కట్టకొబ్బరిపొడి : రెండు టీ స్పూన్లు

తయారుచేయు విధానం :

1) రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి.
2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి.
3) అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి.
4) ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత  కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
5) ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
6) ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి. 
7) దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి.
అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com