ఆయిల్ ట్యాంకర్ హైజాకింగ్.. ఖండించిన బహ్రెయిన్..!!
- May 12, 2026
మనామాః యెమెన్ ప్రాంతీయ జలాల్లో ఎనిమిది మంది ఈజిప్షియన్ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌ను హైజాక్ చేసి, దానిని సోమాలియాలోని పుంట్‌లాండ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న జలాలకు బలవంతంగా తరలించడాన్ని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన అంతర్జాతీయ చట్టం, సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం, సముద్ర భద్రత, సముద్రపు దొంగల నిరోధక ప్రయత్నాలకు సంబంధించిన అంతర్జాతీయ భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది.
ఈజిప్ట్ నావికులను తక్షణం విడుదల చేయాలని కోరింది. నావికుల విడుదల చేసేలా ప్రపంచ దేశాలు చొరవ చూపాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. సముద్రపు దొంగతనాలను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సహకారం అత్యవసరం అని కూడా పేర్కొంది. ఇలాంటి నేరపూరిత చర్యలు అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని, ప్రాంతీయ జలాల్లో భద్రతను పరిరక్షించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







