ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!
- May 12, 2026
మదీనాః మదీనా ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సహకారంతో రవాణా సాధారణ ప్రాధికార సంస్థ (TGA) మదీనాలోని ఖుబా మసీదు లోపలి ప్రాంగణంలో ఆటోమేటిక్ “రోబో బస్” షటిల్ బస్సు సేవలను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఇది సందర్శకులకు వినూత్నమైన మరియు సురక్షితమైన రవాణాను అందిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా 20 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించే సౌకర్యం ఉంటుందన్నారు.
ఆధునిక సెన్సార్లు మరియు హై-రిజల్యూషన్ కెమెరాల మద్దతుతో ఏఐ వ్యవస్థ ద్వారా ఇది రన్ అవుతుందని ప్రకటించారు. ఈ రోబో బస్ కోసం ఖుబా మసీదు లోపలి ప్రాంగణంలో 700 మీటర్ల వరకు ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు 60 రోజులపాటు కొనసాగనుంది.
రోబో బస్ అనేది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం రూపొందించిన ఒక L4 ఆటోమెటిక్ విద్యుత్ ఆధారిత డ్రైవర్‌లేని మినీబస్. ఈ వాహనాలు నావిగేట్ చేయడానికి అధునాతన LiDAR, కెమెరాలు మరియు AIని ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







