ఒమన్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- May 12, 2026
మస్కట్: ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రశాంత్ పిసే, ఒమన్ సుల్తానేట్కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవా (IFS) అధికారి అయిన పిసేకు, మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉంది.
ఈజిప్ట్, లిబియా, ట్యునీషియా మరియు ఇరాక్లలో ఆయన గతంలో విధులు నిర్వర్తించారు. జపాన్, మారిషస్ మరియు యునైటెడ్ కింగ్డమ్లలో కూడా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తాజా నియామకానికి ముందు.. పిసే ఇరాక్‌కు భారత రాయబారిగా సేవలందించారు. ఆ తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మస్కట్‌లో పిసే త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







