అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- May 12, 2026
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, వాస్తవానికి ఇరాన్‌కు తొత్తుగా మారుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్ సైనిక విమానాలకు తన విమానాశ్రయాల్లో ఆశ్రయం కల్పించడం ద్వారా పాక్ తన తటస్థ వైఖరిని విడనాడిందని అమెరికా రక్షణ నిపుణులు భావిస్తున్నారు. “ఒకవైపు అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందుతూ, మరోవైపు అమెరికా శత్రువులకు రహస్యంగా సహకరించడం పాక్‌కు అలవాటే” అని ట్రంప్ సన్నిహితులు విమర్శిస్తున్నారు.
పాకిస్థాన్ పాత్రపై నమ్మకం సన్నగిల్లిన వేళ, మే 13 నుంచి జరగనున్న ట్రంప్ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో చైనాకు ఉన్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్‌ను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. పాకిస్థాన్‌ను పక్కన పెట్టి, నేరుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహాయంతో ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది.ఇరాన్ పంపిన ప్రతిపాదనలను “చెత్త” (Trash) గా అభివర్ణించిన ట్రంప్, ఆ దేశంపై కనికరం చూపే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం కేవలం పేరుకే ఉందని, ఇరాన్ తన మొండి వైఖరిని మార్చుకోకపోతే వైమానిక దాడులే ఏకైక మార్గమని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు సైనిక చర్య చేపట్టాలని అమెరికా రక్షణ శాఖలోని ఒక వర్గం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. ఇరాన్‌ను చర్చల ద్వారా మార్చలేమని, బాంబు దాడులతోనే ఆ దేశ ఆర్థిక, సైనిక వెన్నెముకను విరచాలని వీరు భావిస్తున్నారు. దశాబ్దాలుగా ఆంక్షలను తట్టుకున్న ఇరాన్ అంత త్వరగా లొంగదని, మరికొంత కాలం చర్చలు జరపాలని వీరు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







