గల్ఫ్ ఐక్యతను చాటిచెప్పిన దోహా జీసీసీ గేమ్స్ ప్రారంభోత్సవం..!!
- May 12, 2026
మనామా: దోహాలోని అల్ షకాబ్ ఇండోర్ ఎరీనాలో జీసీసీ గేమ్స్ నాల్గవ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో జీసీసీ దేశాల నుంచి వెయ్యి మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రారంభోవత్సం సందర్భంగా ఖతార్ మరియు గల్ఫ్ వారసత్వాన్ని ప్రతిబింబించే కళాత్మక కార్యక్రమాలతో పాటు జీసీసీ ఐక్యత, ఉమ్మడి గుర్తింపును చాటిచెప్పే "వన్ గల్ఫ్... వన్ హార్ట్" అనే ఒపెరెట్టాను ప్రదర్శించారు.
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ, యూఏఈ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో పాటు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
4వ జీసీసీ క్రీడల నిర్వాహక కమిటీ డైరెక్టర్ జనరల్ అయిన షేక్ ఖలీఫా బిన్ ఖాలిద్ అల్ థానీ తన ప్రారంభోపన్యాసంలో గల్ఫ్ ప్రాంతం అంతటా ఐక్యతను బలోపేతం చేయడం జీసీసీ గేమ్స్ లక్ష్యమని చెప్పారు. అనంతరం షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ జీసీసీ క్రీడల ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సంవత్సరం పోటీలు మే 22 వరకు జరుగుతాయి. ఇందులో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, హ్యాండ్‌బాల్, పాడెల్, ఫెన్సింగ్, బాక్సింగ్ మరియు ఈక్వెస్ట్రియన్‌తో సహా 17 క్రీడలలో అథ్లెట్లు పోటీలు నిర్వహిస్తున్నారు. ఆస్పైర్ డోమ్, హమద్ ఆక్వాటిక్ సెంటర్, లుసైల్ షూటింగ్ రేంజ్ మరియు ఖతార్ రేసింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ క్లబ్‌తో సహా దోహాలోని 10 వేదికలలో ఈ గేమ్స్ జరుగుతాయి. గల్ఫ్ గేమ్స్ లో మహిళా అథ్లెట్లు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







