తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ
- May 12, 2026
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. రేపు (మే 13) జరగనున్న అసెంబ్లీ బలపరీక్షకు ముందే ప్రతిపక్ష అన్నాడీఎంకేలో భారీ చీలిక రావడం, విజయ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలో కీలకమైంది.
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మ్యాజిక్ ఫిగర్ (118)కు స్వల్ప దూరంలో నిలిచిన తమిళగ వెట్రి కళగం (TVK), ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుతో ధీమాగా ఉంది. ముఖ్యంగా అన్నాడీఎంకే నుంచి అనూహ్యంగా మద్దతు లభించడం విజయ్ వ్యూహరచనకు నిదర్శనం.
అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం నాయకత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. స్వయంగా విజయ్, షణ్ముగం నివాసానికి వెళ్లి వేలుమణి సహా ఇతర కీలక నేతలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రాబోయే మంత్రివర్గ విస్తరణ మరియు భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







