ఉత్తర అల్ బతీనాహ్‌లో అంబులెన్స్ ప్రమాదం
- May 12, 2026
డ్రైవర్ మృతి.. పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలు
మస్కట్: ఒమాన్‌లోని ఉత్తర అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో విధుల్లో ఉన్న అంబులెన్స్ ప్రమాదానికి గురై డ్రైవర్ మృతి చెందగా, పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర అల్ బతీనాహ్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన అంబులెన్స్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు తెలిపింది.
ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, ఇతర సిబ్బంది తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు, సహచరులకు CDAA ప్రగాఢ సానుభూతి తెలిపింది. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్‌లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్‌లైన్స్‌తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









