కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- May 12, 2026
హైదరాబాద్: వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని స్పష్టం చేసిన కేసీఆర్.. రైతులు, యువత, విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఇక ఎత్తండి గులాబీ జెండా.. ప్రజా సమస్యలే ఎజెండా.. నేతలంతా ఇక మీదట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించారు గులాబీ బాస్ కేసీఆర్. రైతులు, యువత సమస్యలపై దృష్టిసారించి ప్రత్యేక పోరాట కార్యచరణ రూపొందించాలన్నారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమన్న మాజీ సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేతలకు ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (కే చంద్రశేఖర్ రావు) ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్ఠతపై కీలక సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్చార్జ్ల నియామకంపై నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమన్న కేసీఆర్.. ప్రజా సమస్యలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉందన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నేతలను సూచించారు. అన్నదాతల కష్టాలు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యల పై ఎంత గట్టిగా కొట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు కేసీఆర్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







