కష్టపడే వారికే పదవులు: కేసీఆర్

- May 12, 2026 , by Maagulf
కష్టపడే వారికే పదవులు: కేసీఆర్

హైదరాబాద్: వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని స్పష్టం చేసిన కేసీఆర్.. రైతులు, యువత, విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇక ఎత్తండి గులాబీ జెండా.. ప్రజా సమస్యలే ఎజెండా.. నేతలంతా ఇక మీదట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించారు గులాబీ బాస్ కేసీఆర్. రైతులు, యువత సమస్యలపై దృష్టిసారించి ప్రత్యేక పోరాట కార్యచరణ రూపొందించాలన్నారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమన్న మాజీ సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేతలకు ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్ (కే చంద్రశేఖర్ రావు) ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ​భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్ఠతపై కీలక సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జ్‌ల నియామకంపై నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమన్న కేసీఆర్.. ప్రజా సమస్యలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉందన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నేతలను సూచించారు. అన్నదాతల కష్టాలు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యల పై ఎంత గట్టిగా కొట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు కేసీఆర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com