Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!

- May 13, 2026 , by Maagulf
Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!

దోహా: Metrash మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉన్న QPost ట్రాకింగ్ విచారణ సేవను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ సేవ ద్వారా వినియోగదారులు Qatar Post ద్వారా పంపిన అధికారిక పత్రాలను ట్రాక్ చేయవచ్చని తెలిపింది.

వినియోగదారులు ఈ అప్లికేషన్‌లో పోస్టల్ ట్రాకింగ్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా, తాము పంపిన పత్రాల ప్రస్తుత స్థితిని (status) తెలుసుకోవడానికి ఈ సేవ వీలు కల్పిస్తుందన్నారు.

డెలివరీకి సంబంధించిన తాజా సమాచారాన్ని సులభంగా పొందేలా చేయడం మరియు డిజిటల్ ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరచడం ఈ సేవల ప్రధాన లక్ష్యమని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com