ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- May 13, 2026
కువైట్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తో సంబంధం ఉన్న పలువురిని కువైట్ అరెస్ట్ చేసింది. మే నెల ప్రారంభంలో సముద్ర మార్గం ద్వారా వీరు కువైట్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
విచారణలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందినవారమని వారు ఒప్పుకున్నారని, కువైట్ లో శత్రు కార్యకలాపాలు నిర్వహించడానికి తమను నియమించారని వారు తెలిపారని వివరించింది. ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న ఒక చేపల పడవలో బుబియాన్ ద్వీపంలోకి చొరబడమని రివల్యూషనరీ గార్డ్ తమకు చెప్పిందని, సంబంధిత అధికారుల విచారణలో అనుమానితులు అంగీకరించారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
అరెస్టు చేయబడిన వ్యక్తులను నేవీ కల్నల్ అమీర్ హొస్సేన్ అబ్ద్ మొహమ్మద్ జరాయీ, నేవీ కల్నల్ అబ్దుసమద్ యెదలే ఘనవతి, నేవీ కెప్టెన్ అహ్మద్ జంషిద్ ఘోలం రెజా జొల్ఫఘారీ, మరియు ఫస్ట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ హొస్సేన్ సోహ్రాబ్ ఫొరూఘీ రాడ్గా గుర్తించారు.
మంత్రిత్వ శాఖ ప్రకారం, కువైట్ ను లక్ష్యంగా చేసుకుని శత్రుపూరిత చర్యలకు పాల్పడటం ఈ మిషన్‌లో భాగమని తెలిపింది. ఈ ఆపరేషన్ సమయంలో చొరబాటుదారులు బుబియాన్ ద్వీపంలో మోహరించి ఉన్న కువైట్ సాయుధ దళాలతో తలపడి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆ సమయంలో ఆ బృందంలోని మరో ఇద్దరు సభ్యులు తప్పించుకోగలిగారని మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని నేవల్ కెప్టెన్ మన్సూర్ ఖంబారీ మరియు నౌకకు కమాండింగ్‌గా ఉన్నఅబ్దుల్ అలీ కాజెమ్ సియామ్రీగా గుర్తించారు. అరెస్టు చేసిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్‌లైన్స్‌తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక









