అమలా పాల్ విజయ్ ల డైవర్స్..
- August 07, 2016
అమలా పాల్ విజయ్ ల డైవర్స్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ శనివారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అమలా పాల్ విజయ్ లు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న విషయాన్ని తెలియచేస్తూ వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను మొన్న శనివారం దాఖలు చేసారు.మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే ఈ విడాకుల పిటిషన్ లోఅమలా పాల్ తన భర్త విజయ్ నుండి ఎటువంటి భరణాన్ని కూడా కోరుకోలేదు. కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంటకు కోర్ట్ మరో 6 నెలలు టైమ్ ఇచ్చింది. ఈ 6 నెలల లోపు వాళ్ళు తమ మధ్య ఉన్న విభేదాలను గనుక సద్దుకోలేకపోతే కోర్ట్ వాళ్లకు విడాకులు మంజూరు చేస్తామని తెలియ చేసింది.ఇక కోర్టు నుంచి బయటికొచ్చే సమయంలో అమలాపాల్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుని బయటకు రావడం అక్కడ ఆ కోర్టు హాలులో ఉన్న అనేక మంది దృష్టిలో పడింది అని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 2014 లో అత్యంత ఘనంగా జరిగిన అమలా పాల్ విజయ్ ల పెళ్ళి ఇంత త్వరగా విడాకుల వరకు వెళ్ళడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.విజయ్ దర్శకత్వం వహించిన అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అమలాపాల్ ప్రేమించి విజయ్ ని పెళ్ళి చేసుకోవడంతో కోలీవుడ్ సినిమా ఫంక్షన్స్ లో వీరిద్దరూ అనేక సార్లు మెడ్ ఫర్ ఈచ్ అదర్ గా కనిపించి సందడి చేసేవారు. అమలా పాల్ న్యాయవాది సాయిబ్ జోస్ కిడానగూర్ పిటిషన వేయగా ఆ పిటీషన్ వేసే సమయంలో ఒకరికొకరు అమలాపాల్, విజయ్ ఎదురు పడ్డా కనీసం పలకరించుకోకుండా గంభీరంగా కనిపించడం అందరి దృష్టిలో పడింది.ఇది ఇలా ఉండగా అమలా పాల్ మరో రెండు మూడు రోజులలో ఒక ప్రత్యేకమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయ్ ని టార్గెట్ చేస్తూ షాకింగ్ నిజాలు బయట పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా స్టార్ హీరోయిన్స్ ప్రియమణి మమతా మోహన్ దాస్ మీడియాతో అమలా పాల్ డైవర్స్ విషయమై షాకింగ్ కామెంట్స్ చేసారు.
సినిమాల్లో నటించాలనుకునే హీరోయిన్ల వ్యక్తిగత హక్కు స్వేచ్ఛ పై భర్తల పెత్తనం ఏమిటని ప్రశ్నించడమే కాకుండా పెళ్లైనంత మాత్రాన ఒక మహిళ తన జీవితాన్ని ఎంచుకునే హక్కును కాలరాసే హక్కు భర్తకు ఎక్కడ ఉందని ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు అమలా పాల్ లాంటి మంచి నటిని వంటగదికే పరిమితం చేయాలనుకోవడం విజయ్ కుటుంబానికి తగదని అంటూ కామెంట్స్ చేసింది ప్రియమణి. ఈ విడాకుల వ్యవహారం మధ్య కేవలం ఒకేఒక్క నెలరోజులలో అమలా పాల్ మూడు సినిమాలలో నటించడానికి ఎగ్రిమెంట్ పై సైన్ చేయడం ఆమె ధైర్యాన్ని సూచిస్తోంది అంటూ కోలీవుడ్ మీడియా కామెంట్స్ రాస్తోంది..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







