'నక్షత్రం'లో గెస్ట్ పాత్రలో సాయి ధరమ్ తేజ..
- August 07, 2016
యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ త్వరలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అదీ పోలీస్ పాత్రలో. రీసెంట్ గా వచ్చిన 'సుప్రీమ్'లో లేడీ పోలీసాఫీసర్‌తో ప్రేమలో పడిన యువకుడిగా కనిపించిన సాయిధరమ్ తేజ్ ....ఆ సినిమాలో హీరోయిన్‌ని ప్రేమలో పడేయడానికి సరదాగా ఓసారి ఖాకీ చొక్కా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం నిజమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, కాజల్ అగర్వాల్, రెజీనా నటీనటులుగా రూపొందుతున్న సినిమా 'నక్షత్రం'. ఇందులో సాయిధరమ్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇది గెస్ట్ రోల్ అనమాట. త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారు. హీరో సందీప్ కిషన్ ఈ విషయం ట్వీట్ ద్వారా తెలియజేశారు.ఇంక అనుష్క హీరోయిన్ గా దిల్ రాజు సినిమా చేస్తారని కూడా వినిపించింది. సూపర్‌హిట్ సినిమా 'ఖడ్గం' సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 తీస్తారని ప్రచారం జరిగింది. కానీ, చివరగా సందీప్ కిషన్‌తో కొత్త చిత్రం చేస్తున్నారు.శ్రీ చక్ర మీడియా సారథ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పాతెకంపై కే. శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ఎస్. వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో 'నక్షత్రం' సినిమా తీస్తున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







