'నాగబంధం' నుంచి లీలావతిగా అనసూయ భరద్వాజ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
- May 15, 2026
అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి.
తాజాగా మేకర్స్ ‘నాగబంధం’ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘లీలావతి’ పాత్రలో ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది.
సంప్రదాయ తెలుపు చీరలో, ట్రైబల్ జ్యువెలరీతో అనసూయ కనిపించిన తీరు పాత్రలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది. లీలావతి పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉండబోతోందనే ఫీల్ ఈ పోస్టర్‌తోనే స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’ చిత్రం జూలై 3న విడుదల కానుంది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్‌కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్‌బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ









