అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల కారణంగానే ఐఎస్ బలోపేతo
- August 08, 2016
అమెరికా సైన్యం లిబియాలో నిర్వహించిన వైమానిక దాడుల కారణంగానే ఐఎస్ బలోపేతమైందని వర్జీనియా సెనెటర్ లిచర్డ్ బ్లాక్ పేర్కొన్నారు. కాగా, ఈనెల 1న లిబియాలోని సిర్ట్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా భద్రతా బలగాలు వైమానిక దాడులు నిర్వహించాయి. లిబియా ప్రభుత్వం చేసిన విజ్ఞాపనల మేరకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపామని అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. అయితే, రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే అమెరికా ఈ దాడులను పాక్షికంగా జరిపిందని బ్లాక్ చెప్పారు. ట్రిపోలీ, బెంగజీ నగరాల మధ్య ఉన్న సిర్ట్ ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. గతేడాది ఆగస్టు నుంచి ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో పాగా వేశారు. వారిని అక్కడి నుంచి తరిమివేసేందుకు లిబియా బలగాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. అమెరికా వైమానిక దాడులు నామమాత్రంగా లిబియాలో దాడులు నిర్వహించడంతో ఐఎస్ మరింత పుంజుకున్నది. ఐఎస్‌కు అమెరికా మద్దతు : ఐఎస్‌కు అమెరికా అండదండలున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల వికీలీక్స్ బయటపెట్టింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ జిహాదీలకు ఆయుధాలు సరఫరా చేసినట్టు వికీలీక్స్ ప్రకటించింది. నివురుగప్పిన నిజాలను ఆధారాలతో సహా బయటపెట్టిన వికీలీక్స్ కృషిని అభినందిస్తున్నట్టు బ్లాక్ తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చిన హిల్లరీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అమెరికా కార్యదర్శి పదవిలో ఉన్నప్పుడు హిల్లరీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు నిధుల సమీకరణ చేపట్టారని ధ్వజమెత్తారు. అమెరికా ఆయుధాల సరఫరా చేస్తుందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అంతేగాకుండా, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ దేశాల్లో అమెరికా ఉగ్రవాద శిబిరాలు నెలకొల్పిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







