రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది...

- August 08, 2016 , by Maagulf
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది...

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. నది ఉధృత ప్రవాహానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సు నీటిలో మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు. స్థానికులు సకాలంలో సాహసంతో కూడిన పనిచేశారని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు అభినందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com