పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంపేలుళ్లతో దద్దరిల్లింది

- August 08, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంపేలుళ్లతో దద్దరిల్లింది

పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంపేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని సివిల్‌ ఆస్పత్రిలో జరిగిన పేలుళ్లలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 35 మంది గాయాలపాలయ్యారు. బలోచిస్థాన్‌ బార్‌ అసోసియేషన్స్‌ ప్రెసిడెంట్‌ బిలాల్‌ను కాల్చి చంపిన తర్వాత ఆస్పత్రిలో పేలుళ్లు సంభవించాయి. ఆస్పత్రిలో బిలాల్‌ మృతదేహం ఉంచిన ఎమర్జెన్సీ వార్డు వద్ద లాయర్లు, జర్నలిస్టులు గుమిగూడి ఉన్న సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఎమర్జెన్సీ, సహాయక బృందాలు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో ప్రమాదాల చికిత్స వార్డు ద్వారం వద్ద పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. బాంబు పేలుడు తర్వాత తుపాకీ పేలుళ్లు కూడా వినిపించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com