కశ్మీర్ అంశంపై ప్రతిపక్షాల విమర్శలు
- August 08, 2016
కశ్మీర్ అంశంపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమై కశ్మీర్ పరిస్థితులపై చర్చించారు.హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో కశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 55 మంది మృతిచెందగా.. మరో 3వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితిపై పార్లమెంట్‌లో విపక్షాలు మండిపడ్డాయి. 'ఓ వైపు అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా సరే కశ్మీర్ ఉద్రిక్తతపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేద'ంటూ రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







