ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్నా సుష్మాస్వరాజ్‌..

- August 08, 2016 , by Maagulf
ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్నా సుష్మాస్వరాజ్‌..

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. వచ్చే నెలలో న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో 71వ జనరల్‌ అసెంబ్లీ జరగనుంది. ఈ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్‌ 26న కేంద్రమంత్రి సుష్మ ప్రసంగించనున్నారు.గత రెండేళ్లుగా ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీఈ సారి హాజరవడం లేదు. దీంతో ఈ ఏడాది సమావేశాలకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ హాజరవనున్నారు. సెప్టెంబర్‌ 20 నుంచి 26 వరకు ఈ జనరల్‌ డిబేట్‌ కొనసాగనుంది. సెప్టెంబర్‌ 26న జరిగే వార్షిక ఉన్నతస్థాయి చర్చలో సుష్మాస్వరాజ్‌ ప్రసంగిస్తారు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్‌ 21న ఆయన మాట్లాడనున్నారు.
2014లో జరిగిన ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని ప్రపంచ నేతలను కోరిన విషయం తెలిసిందే. అందుకు సమితి ఆమోదం తెలపడంతో జూన్‌ 21న ఏటా యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com