ఒమన్‌లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- May 19, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో నిర్మాణ సామగ్రి ధరలకు సంబంధించి వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీపీఏ) ఒక ప్రకటన జారీ చేసింది. నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక మార్కెట్లలో వాటి పెరిగిన ధరల గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను వినియోగదారుల పరిరక్షణ అథారిటీ పర్యవేక్షిస్తోందన్నారు.
ధరల పెరుగుదల ప్రకటన ఫేక్ అని, అది వాస్తవ ధరల స్థాయిలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని అథారిటీ స్పష్టం చేసింది. ఉదాహరణకు, ఈ సంవత్సరం (2026) ఫిబ్రవరి మరియు మే నెలల మధ్య ఐరన్ ధర కేవలం 12 శాతం, సిమెంట్ ధరలు 18 శాతం పెరిగాయని తెలిపింది.
స్థానిక సామగ్రితో సహా భవన నిర్మాణ సామగ్రి ధరలు సరఫరా మరియు డిమాండ్, ఇతర పరిస్థితుల కారణంగా ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను బట్టి వివిధ స్థాయిలలో ధరలు పెరుగుదల ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిని నిరోధించడానికి, వివిధ మార్కెట్లలో భవన నిర్మాణ సామగ్రి ధరలను పర్యవేక్షించేందుకు అథారిటీ తన పర్యవేక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని తెలిపింది. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అనేక సంస్థలను గుర్తించడం జరిగిందని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







