‘పెద్ది’ ట్రైలర్‌- యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెం.1 ట్రెండింగ్

- May 19, 2026 , by Maagulf
‘పెద్ది’ ట్రైలర్‌- యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెం.1 ట్రెండింగ్

24 గంటల్లో 101 మిలియన్+ వ్యూస్ తో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌- యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెం.1 ట్రెండింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ట్రైలర్  100 మిలియన్ మార్క్‌ను దాటి 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం పలు భాషల్లో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘పెద్ది’పైనే ఉంది. ట్రైలర్ సాధించిన ఈ భారీ రికార్డులు సినిమాపై ఉన్న అంచనాలను మరింత బలపరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు దీన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటుండగా, హిందీతో పాటు ఇతర భాషల మీడియా కూడా ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత గ్రిప్పింగ్, పవర్‌ఫుల్ ట్రైలర్‌లలో ఇదొకటిగా ప్రశంసలు అందుకుంటుంది.

రామ్ చరణ్ చేసిన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. క్రికెట్ సన్నివేశాల్లో లీన్  లుక్‌లో కనిపించిన ఆయన.. కుస్తీ ఎపిసోడ్స్‌లో మాత్రం పూర్తి స్థాయి ప్రొఫెషనల్ రెజ్లర్‌లా పవర్‌ఫుల్‌గా కనిపించారు. అంతేకాదు రన్నర్‌గా, మరికొన్ని క్రీడల్లో పాల్గొనే వ్యక్తిగా కూడా ఆయన పాత్రను చూపించడం అదిరిపోయింది. దీంతో ఇది కేవలం హీరో ఎలివేషన్ క్యారెక్టర్ కాకుండా ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ తో కూడిన బలమైన పాత్రగా నిలిచింది.

దర్శకుడు బుచ్చిబాబు సానా ‘పెద్ది’ ప్రపంచాన్ని ఎంతో డీటెయిల్‌గా తీర్చిదిద్దారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్, ఎడిటర్ నవీన్ నూలి తమ అత్యుత్తమ వర్క్ ని ఈ చిత్రానికి అందించారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ తో ‘పెద్ది’ వరల్డ్ విజువల్‌గా ఎంత  అద్భుతంగా వుంటుందో స్పష్టమైయింది.  

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఈ ట్రైలర్ మాత్రం ఆ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం దేశమంతా ‘పెద్ది’ గురించే మాట్లాడుతోంది. ఇదంతా పెద్ది ట్రైలర్ క్రియేట్ చేసి యుఫోరియా.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానుండగా.. ‘పెద్ది’ భారతీయ సినీ పరిశ్రమలో భారీ సంచలనంగా నిలవబోతోందనే భావన అందరిలో బలంగా వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com