నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- May 21, 2026
మక్కా: వాణిజ్య మంత్రిత్వ శాఖ నెలరోజుల్లో మక్కా మరియు మదీనా ప్రాంతాలలోని వాణిజ్య సంస్థలు మరియు రిటైల్ అవుట్లెట్లలో 42,791 తనిఖీలు నిర్వహించింది. ప్రస్తుత హజ్ సీజన్ కోసం రూపొందించిన పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిత్యావసర వస్తువుల స్టాక్ తోపాటు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు, యాత్రికుల విభిన్న అవసరాలను తీర్చడానికి స్థానిక మార్కెట్ల సంసిద్ధతను బలోపేతం చేయడం తనిఖీల లక్ష్యమని తెలిపింది.
తనిఖీల్లో భాగంగా రిటైల్ కేంద్రాలు, పబ్లిక్ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలలో కూడా ఇన్స్పెక్టర్లు పరిశీలించినట్లు పేర్కొన్నది. వాణిజ్య నిబంధనల అమలు, యాత్రికులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. హజ్ సీజన్ మొత్తం తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







